Friday, 17 October 2025
ఎవ్వని చేజనించు
ఈ పద్యము భక్త పోతన తన గజేంద్ర మోక్షము లో వ్రాసినది.
ఎవ్వని చే జనించు ,జగమెవ్వని లోపలనుండు లీనమై,
ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మథ్యలయుడెవ్వడు,సర్వము తానైన వా
డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరు నే శరణంబు వేడెదన్॥
గజేంద్ర మోక్షములో గజేంద్రుడు చాలా కాలము మొసలితో పోరాడుతాడు.కానీ మొసలి పట్టు విడవదు.గజేంద్రుడి శక్తి యుక్తులు అన్నీ క్షీణించడం నొదలు పెడతాయి.అప్పుడు భగవంతుని ప్రార్థిస్తాడు.ఎవరితో పుట్టుక మొదలవుతుందో,ఈ జగమంతా ఎవనిలోపల లీనమై ఉంటుందో,ఆ ఈశ్వరుడిని నేను బ్రతిమాలాడుకుంటున్నాను.అక్కడా,ఇక్కడా అని కాకుండా సర్వాంతర్యామి అయిన ఆ దేవదేవుని నేను కోరుకుంటున్నాను.ఈ సృష్టి,స్థితి లయకారుడు అయిన మహామహుడిని ప్రార్థిస్తున్నాను.ఎవరికి అయితే మొదలు,మథ్య,చివరలు లేకుండా అనంతంగా ఈ బ్రహ్మాండాన్ని అంతా చుట్టేసి తనలో నింపుకుని ఉన్నాడో అతనే నా ప్రభువు.అతనిని నేను శరణు జొచ్చుచున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment