Saturday, 18 October 2025

ఇందు గల డందులేడని

ఇందుగల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి జూచిన అందందే గలడు దాన వాగ్రణి వింటే॥ ఈ పద్యము బమ్మెర పోతన రచించిన భాగవతములో వ్రాసినది. ప్రహ్లాదుడిని వాళ్ళ తండ్రి అయిన దానవ రాజు,హిరణ్య కశిపుడు భగవంతుడు అయిన హరిని చూపించమని నిలదీస్తాడు.అప్పుడు బాలుడు అయిన ప్రహ్లాదుడు ఈ సమాథానం ఇస్తాడు. ఓ తండ్రీ!నువ్వు నన్ను భగవంతుడిని చూపించమని అడుగుతున్నావు.సరే!ఆ నారాయణుడు ఇక్కడ ఉన్నాడు,అక్కడ లేడు అని చెప్పేదానికి అలవి కాదు.అతను సర్వాంతర్యామి.ప్రతిచోటాఉంటాడు.ప్రతి అణువులో ఉంటాడు.మనము మనసు పెట్టి ఎక్కడెక్కడ చూస్తే అక్కడక్కడే కానవస్తాడు.మనలను కటాక్షిస్తాడు.కరుణిస్తాడు. అప్పుడు ఆ మూర్ఖపు తండ్రి ఈ ద్వారబంథములో ఉన్నాడా చూపించు అని అడుగుతాడు.అడిగిన అర క్షణంలో హతాశుడవుతాడు.

No comments:

Post a Comment